ప్రమాదకరంగా వాగు దాటిన పెళ్లిజంట

ప్రమాదకరంగా వాగు దాటిన పెళ్లిజంట

ప్రకాశం: దోర్నాల మండలంలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్మంలో గంటవానిపల్లి సమీపంలో తీగలేరు ఉద్ధృతి పెరగడంతో రాకపోకలు స్తంభించాయి. రెండు రోజుల క్రితం పెళ్లైన నూతన వధూవరులు మర్లుపెళ్లికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బంధువుల సహాయంతో వారు వాగును దాటారు.