అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 20వ డివిజన్, మేనకా గాంధీ నగర్ 7వ లైన్‌లో రూ.49.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైన్, ఆర్‌సీసీ కల్వర్టుల నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ.. గుంటూరు పశ్చిమలో అభివృద్ధి-సంక్షేమ కార్యకలాపాలు పారదర్శకంగా, వేగంగా అమలవుతాయన్నారు.