భారీ వర్షాలు.. మ్యాన్‌హోల్స్ క్లీనింగ్‌కు 2 రోజులే గడువు

భారీ వర్షాలు.. మ్యాన్‌హోల్స్  క్లీనింగ్‌కు 2 రోజులే గడువు

HYD: గ్రేటర్ HYDలో ఇటీవల భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాన్ హోల్స్‌లో నిలిచిపోయిన చెత్తను 2 రోజుల్లో పూర్తిగా తొలగించాల్సిందిగా GHMC ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ రంగనాథ్ అధికారులను అదేశించారు. మాదాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.