ముప్పాళ్ల ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు
PLD: ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడులో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ అభయాంజనేయ, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం సందర్శించారు. ఆయన స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. బెల్లంకొండ మండలం కొల్లూరు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.