VIDEO: ఇంటి మెట్ల వద్ద నాగుపాము కలకలం
VZM: రాజాం బాబా నగర్‌లో ఓ ఇంటి వద్ద నాగుపాము శుక్రవారం కనిపించి కలకలం రేపింది. ఆకిరి రవీంద్ర దంపతులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి ఇంటికి చేరుకోగానే మెట్ల వద్ద పాము బుసలుకొడుతూ కనిపించింది. భయపడిన వారు తర్వాత తేరుకుని ఈ విషయాన్ని పొరుగువారికి తెలిపారు.స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకుని డబ్బాలో బంధించాడు.