కరపలో పంచాయతీ అధికారి తనిఖీలు

KKD: కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ బుధవారం కరప మండలం పాతర్లగడ్డలో తనిఖీలు నిర్వహించారు. పంచాయతీ సరఫరా చేస్తున్న మంచినీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. తడి, పొడి చెత్త సేకరణ విధానంపై ఆరాతీశారు. సంపూర్ణ పారిశుద్ధ్యం పాటించి, రోగాల వ్యాప్తి నివారించాల్సిందిగా సూచించారు.