'ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి'

NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోలి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేతేపల్లి మండలం కొండకింది గూడెం గ్రామంలో వికలాంగులతో శుక్రవారం సమావేశం నిర్వహించి వారి నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెన్షన్‌ను 6 వేలకు పెంచాలని అన్నారు.