ఎక్కువగా పిల్లల్ని కనే వారికి GOOD NEWS
AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ.25 వేలు ఇస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాకుండా ఈ నగదు పురస్కారం గేమ్ ఛేంజర్ కాబోతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త పాలసీ అమలు చేస్తామని చెప్పారు.