నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో కేంద్ర మంత్రి పర్యటన
HYD: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వేసవిలో తీసుకుంటున్న చర్యలను అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడి తెలుసుకున్నారు. వేసవిలో అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంటుందని, ఏ మాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వివిధ రకాల రిపోర్టులను అందించారు.