డెంగ్యూ పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

మన్యం: డెంగ్యూ నివారణలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా అవగాహనా ర్యాలీ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. డెంగ్యూ వ్యాధి ఎడిస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందని, ఇవి ముఖ్యంగా పగటి పూట కుట్టే దోమలు అని తెలిపారు.