'వీధి కుక్కల బారి నుంచి రక్షించండి'

'వీధి కుక్కల బారి నుంచి రక్షించండి'

WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలో వీధి కుక్కల బెడద తీవ్రమైందని, వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని 39వ డివిజన్ నివాసి సోమవారం గ్రీవెన్స్ సెల్లో విన్నవించారు. ఇటీవల దాడులు పెరిగి జనం గాయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల తరలింపునకు, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుని నగరవాసులను రక్షించాలని వినతిపత్రం సమర్పించారు.