కుష్టువ్యాధిపై శిక్షణ తరగతులు
VZM: ఈనెల 17 నుంచి 30 వరకు కుష్టువ్యాధి నిర్మూలనకు ప్రతి గ్రామంలో పక్షంరోజులు ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించనున్నట్లు కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిణి సీతల్ వర్మ తెలిపారు. ఈ మేరకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాళ్లకు వేసుకొన్న చెప్పులు జారిపోవడం, ఏదైనా దెబ్బ తగిలినా తెలియకపోవడం మొదలగు లక్షణాలు ఉంటాయన్నారు.