VIDEO: కాలువ నిర్వహణలో లోపాలు.. రైతులకు ఇబ్బందులు
ASF: వాంకిడి మండలం కొమురం భీం ఎడమ కాలువ నిర్వహణ లోపాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాలువ పొడవునా తుంగ భారీగా పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. నిధులు ఉన్నా శుభ్రపరిచే పనులు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. యాసంగి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, వెంటనే తుంగను తొలగించి సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేశారు.