రుద్రగూడెం పాఠశాల ఆవరణ బురదమయం
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రుద్రగూడెం ZPSS పాఠశాల ఆవరణం బురదమయంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా పాఠశాల ప్రాంగణం పూర్తిగా చిత్తడిగా మారి విద్యార్థులు జారి పడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు పనులు చేసి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరారు.