'కౌలు రైతు కార్డులు తీసుకోవాలి'

BPT: బల్లికురవ మండలంలోని వైదన, కొమ్మినేనివారిపాలెం గ్రామాలలో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు నిర్వహించారు. మండలంలో కౌలు రైతులందరూ కౌలు రైతు కార్డులు తీసుకోవాలని అన్నారు. అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు పడినవారు రేపు మీ మీ గ్రామములో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.