బాలికను వేధించిన యువకుడు అరెస్ట్

బాలికను వేధించిన యువకుడు అరెస్ట్

గుంటూరు నల్లపాడు పరిధిలో బాలికను మోసగించి లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న యాకసిరి ఆనంద్ (22)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ బి.వి. మధుసూదనరావు తెలిపారు. బాలికలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.