రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్‌తో మాజీ ఎమ్మెల్యే భేటీ
కృష్ణా: రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోనుగుంట కోటేశ్వరరావును ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ శాంతికుమారి కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయాల అభివృద్ధి, త్వరలో జరగబోయే ప్రమాణస్వీకార కార్యక్రమంపై వారు చర్చించారు.