సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
MDK: చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన బక్క లతకు మంజూరైన రూ.24,000 సీఎం సహాయ నిధి చెక్కును శనివారం నాయకులు పంపిణీ చేశారు. వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములు, ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ మనోహర్, నర్సింహారెడ్డి, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొని చెక్కును అందజేశారు.