'మహిళా బ్లూ కోల్ట్స్ ప్రారంభం'

NLG: జిల్లాలో "SHE leads - NALGONDA believes" నినాదంతో మహిళా బ్లూ కోల్ట్స్ బృందాన్ని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. మహిళా పోలీసులు స్టేషన్ పనులకు మాత్రమే పరిమితం కాకుండా పెట్రోలింగ్, ట్రాఫిక్, కోర్ట్, బందోబస్త్ వంటి అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. మహిళలలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రత్యేక శిక్షణలు కూడా ఇవ్వనున్నట్టు చెప్పారు.