VIDEO: జరుగుమల్లి పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
PKSM: జరుగుమల్లి మండలం కామేపల్లిలో ఉన్న ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మ ఆలయంలో ఇవాళ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, తల్లికి నిమ్మకాయ దండ, కుంకుమ పూజ, గోత్ర నామార్చనలు, వాహన పూజలు నిర్వహించారు.