భగత్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రమదానం
సత్యసాయి: పరిగి మండలం కోడిగినహళ్లి గ్రామపంచాయతీ పరిధిలో భగత్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో 'శ్రమదానం' అనే కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని మధుగిరి రోడ్డు బస్టాండ్, దేవాలయాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. సంస్థ సభ్యులు మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.