మాధవరంలో వాహనాల విస్తృత తనిఖీలు

మాధవరంలో వాహనాల విస్తృత తనిఖీలు

KRNL: మంత్రాలయం మండలం మాధవరంలో సీఐ రామాంజులు, ఎస్సై శివాంజల్ ఆధ్వర్యంలో కర్ణాటక నుంచి వస్తున్న వాహనాలకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని, నేరాలను అరికట్టడానికి నిత్యం తనిఖీలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. లైసెన్స్,హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని పరిశీలిస్తున్నామని, మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.