నేరేడు చర్లలో చేప పిల్లల పంపిణీ

నేరేడు చర్లలో చేప పిల్లల పంపిణీ

SRPT: నేరేడుచర్ల మండలంలోని పలు గ్రామాల ఊర చెరువుల్లో శుక్రవారం చేపపిల్లలను పంపిణీ చేశారు. నేరేడుచర్ల, దిర్శించర్లలో 75 వేల చొప్పున, చింతకుంట్ల, బోడలదిన్న చెరువుల్లో లక్షా 20 వేల చొప్పున చేపపిల్లలను అధికారులు విడుదల చేశారు. ఎంపీడీవో శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. మత్స్యకారుల ఉపాధి మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. ఏవో జావేద్, ఏఈవో నిర్మల తదితరులు ఉన్నారు