అధ్వానంగా మర్రిగడ్డ ఎనగల్ రోడ్డు
SRCL: చందుర్తి మండలంలోని మర్రిగడ్డ-ఎన్గల్ గ్రామాల మధ్య రోడ్డు కంకర తేలి పెద్దపెద్ద గుంతలతో రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం సరిగా లేక ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఎన్గల్ గ్రామం నుంచి మర్రిగడ్డ వెళ్లే రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు.