పశువుల సంక్షేమానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే

పశువుల సంక్షేమానికి ప్రాధాన్యత: ఎమ్మెల్యే

ASR: ఉమ్మడి ప్రభుత్వంలో పశువుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగడ్డలో రూ.23 లక్షలతో నిర్మించిన గోకులాన్ని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఇటువంటి గోకులాలు మండలంలో ఇప్పటికి 26 మంజూరు అయ్యాయని మరో 4 త్వరలో మంజూరు చేస్తామని అన్నారు. పశు సంపదను రైతులు కాపాడుకోవాలని కోరారు.