రహదారుల అభివృద్ధికి రూ. 43.30 కోట్లు: కొలికపూడి
NTR: తిరువూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ. 43.30 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల తరఫున సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలుపారు. అనంతరం వారి చిత్రపటాలకు స్థానిక కార్యాలయంలో పాలాభిషేకం చేశారు.