'వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి'

'వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి'

AKP: వైద్య ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని డీపీఎంవో డాక్టర్ ప్రశాంతి సూచించారు. శనివారం కోటవురట్ల మండలం రామచంద్రపాలెం గ్రామంలో హెల్త్ వెల్నెస్ సెంటర్‌ను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.