హోంగార్డులకు ఆటల పోటీలు
SS: జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో హోంగార్డులకు ఆటల పోటీలు నిర్వహించారు. డిసెంబర్ 6న హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించారు. పురుషుల విభాగంలో 100 మీటర్ల పరుగు, షాట్‌ఫుట్, మహిళల విభాగంలో లెమన్ అండ్ స్పూన్ వంటి ఆటలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నారు.