VIDEO: ఈనెల 29న గొర్లు, మేకల అంగడి ప్రారంభం
SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలో నూతనంగా గొర్లు, మేకల అంగడిని గ్రామ పంచాయతీ ఆధ్యర్యంలో ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్ మల్లారపు జ్యోత్స్న-అరుణ్ కుమార్ తెలిపారు. ఈనెల 29 నుంచి రైతు వేదిక ప్రక్కన గల స్థలంలో ఈ అంగడి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. పరిసర గ్రామ, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఆదివారం అంగడి జరుగుతుందని వెల్లడించారు.