ట్రాఫిక్ పోలీసుల హెల్మెట్ అవగాహన కార్యక్రమం
CTR: చిత్తూరులో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నిత్యబాబు, సిబ్బంది ముఖ్య కూడళ్ల వద్ద హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ 6, 2026 నుంచి ప్రారంభమయ్యే “Wear Helmet- Win Prizes” ప్రచారానికి ముందుగా, హెల్మెట్ ధరించే వాహనదారులకు బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు హెల్మెట్ ధరించాలన్నారు.