పెద్ద హనుమాన్ మందిరంలో ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు

NZB: బోధన్ పెద్ద హనుమాన్ మందిరంలో నేడు ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు నిర్వహించనున్నట్లు అర్చకులు ప్రవీన్ శర్మ, ఈవో రాములు ఛైర్మన్ శంకర్ తెలిపారు. ఆనవాయితీ ప్రకారము ఈ సంవత్సరం ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు మున్సిపల్ వారి సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.