పేకాట ఆడుతున్న ముగ్గురి పై కేసు నమోదు

పేకాట ఆడుతున్న ముగ్గురి పై కేసు నమోదు

VZM: కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి కుమ్మరి బంజరు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ షణ్ముఖరావు మంగళవారం తెలిపారు. వారి వద్ద నుంచి రెండు చరవాణులు, రూ 24,400 ల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. పోలీసు స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.