గుండెపోటుతో తాపీ మేస్త్రి మృతి
NGKL: తాడూరు మండలంలోని తుమ్మల్ సూర్ గ్రామానికి చెందిన భాషమోని శ్రీశైలం (35) గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం సాయంత్రం చాతిలో నొప్పిగా ఉంది అంటూ కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించడంతో హైదరాబాద్ తరలించగా శుక్రవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు.