VIDEO: క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానం
NRPT: మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నీ ఘనంగా ముగిసింది. ఐదు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీలలో విజేతగా నిలిచిన జట్టుకు రూ.15 వేల, రన్నరప్ జట్టుకు రూ.10 వేలు నగదుతో పాటు ట్రోఫీలను అందజేశారు. గ్రామ యువ నేతలు ఉప్పరి అశోక్, గువ్వల తిరుపతి చేతుల మీదుగా ఈ బహుమతులు పంపిణీ చేశారు.