పుట్టేడు దుఃఖంతో పరీక్షకు హాజరైన కొడుకు

పుట్టేడు దుఃఖంతో పరీక్షకు హాజరైన కొడుకు

GDWL: జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. అమరవాయి గ్రామానికి చెందిన కరీం అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, తండ్రి మృతదేహం అంత్యక్రియలకు సిద్ధమవుతున్న తరుణంలో కొడుకు సమీర్ పది పరీక్ష రాసేందుకు వెళ్ళాడు. ​ఒకవైపు కన్న తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖం.. మరోవైపు భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. కన్నీళ్లు కారుస్తూ సమీర్ పరీక్షకు హాజరైన తీరు స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.