15 మంది టౌన్ ప్లానింగ్ అధికారులకు మెమోలు జారీ

కర్నూలు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో పనిచేసే 15 మంది టౌన్ ప్లానింగ్ కార్యదర్శులకు నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ మెమోలు జారీ చేశారు. భవన యజమానులు ఆన్‌లైన్‌లో బిల్డింగ్ అప్లికేషన్లు పెట్టుకొని 20 రోజులు గడుస్తున్నా ప్లానింగ్ కార్యదర్శులు పట్టించుకోలేదు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.