పిల్లలకు అర్ధమయ్యేలా విద్య నేర్పించాలి: MEO

SRD: విద్యార్ధులకు అర్ధమయ్యేలా విద్యనందించాలని ఎంఈవో రహీమొద్దీన్ అన్నారు. కంగ్టి మండల జమ్గి బీ, సాధూ తాండ ప్రభుత్వ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. FLN, బోధన విధానంపై ఆయన పరిశీలించారు. ప్రాథమిక విద్యార్థులకు సులభరీతిలో చదవడం రాయడం నేర్పాలని ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. అనంతరం మధ్యాహ్న భోజనం నిర్వాహణ తీరు, మెనూ ప్రకారం వంటను చేస్తున్నార లేదా అని అడిగి తెలుసుకున్నారు.