నేడు ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి శిక్షణ: AO
VZM: గంట్యాడ మండల కేంద్రంలో శనివారం ఖరీఫ్ 2025కు సంబంధించి ధాన్యం కొనుగోలు సేకరణ నిమిత్తం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు AO శ్యాం కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ధాన్యం తరలించేందుకు ఆసక్తి ఉన్న ట్రాక్టర్ల యజమానులు జీపీఎస్ ట్రాకర్ రిజిస్టేషన్‌కు రూ. 1400 చెల్లించి రిజిస్టేషన్ చేసుకోవాలన్నారు. సంబంధిత అధికారు హాజరుకావలని కోరారు.