'గడువులోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి'

'గడువులోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి'

JGL: ధర్మపురి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, గడువులోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం రూ. 5 లక్షల సహాయం అందజేస్తుందని తెలిపారు. ఇసుక బజార్, ధరల నియంత్రణపై కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు.