పవర్ లిఫ్టర్‌కు అభినందనలు తెలిపిన మంత్రి

పవర్ లిఫ్టర్‌కు అభినందనలు తెలిపిన మంత్రి

GNTR: కోస్టారికాలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన మంగళగిరి క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు మంత్రి నారా లోకేశ్ మంగళవారం అభినందనలు తెలిపారు. తన ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి, మంగళగిరికి ఆమె గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. సాదియా అల్మాస్‌కు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.