నందిగామలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
NTR: నందిగామ పట్టణం పాత బస్టాండ్‌లోని బాబు జగజీవన్ రామ్ బిల్డింగ్ ప్రాంగణంలో నందిగామ పాస్టర్స్ ఫెయిత్ ఫైర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు.