VIDEO: ఉపాధి పనులపై సామాజిక తనిఖీ ప్రజా వేదిక
GNTR: ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులు, కూలీలకు చెల్లించిన వేతనాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రికార్డులను డ్వామా పీడీ శంకర్ పరిశీలించారు.