తడి చెత్త పొడి చెత్త పై ప్రజలకు అవగాహన
ELR: తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించే విధానాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో గెడ్డం రమేష్ బాబు అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం కాగుపాడులో ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పెద్దిరాజు, సిబ్బంది పాల్గొన్నారు.