'లబ్దిదారులకు అసౌకర్యం కలగకుండా సేవలందించాలి'

E.G: లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడంలో జాప్యం చేయరాదని జిల్లా కలెక్టర్ డా. పి. ప్రశాంతి సూచించారు. రాజమండ్రి 49వ వార్డులో పింఛన్ల పంపిణీ ప్రక్రియపై స్వయంగా సమీక్షించేందుకు శుక్రవారం లబ్ధిదారులను, ప్రజలను ప్రత్యక్షంగా కలసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించాలన్నారు.