బాలికపై లైంగిక దాడి.. వృద్ధుడికి 24 ఏళ్ల శిక్ష

TG: నల్లగొండ జిల్లా POCSO కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అన్నెపర్రి గ్రామంలో 2023లో 10 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల వృద్ధుడు మర్రి ఊషయ్యకు POCSO న్యాయస్థానం 24 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నిందితుడికి రూ.40,000 జరిమానా, బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. స్పెషల్ జడ్జి రోజా రమణి ఇవాళ తీర్పు వెల్లడించారు.