రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ చాటాలి: మంత్రి
NRPT: SGF క్రికెట్ పోటీలలో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే అండర్-14 బాలుర క్రికెట్ పోటీల కోసం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జట్టు బుధవారం బయలుదేరింది. క్రీడాకారులు మక్తల్ లోని మంత్రి నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్బంగా జట్టుకు మంత్రి 'ఆల్ ది బెస్ట్' తెలిపారు.