సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించండి

సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించండి

ASR: డుంబ్రిగుడ మండలంలోని అరమ పంచాయితీ బడిమెల గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. సీసీ రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం లేక చిన్నపాటి వర్షం కురిసిన ఉన్న మట్టి రోడ్డు బురదమయంగా తయారయ్యి అధ్వానంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించాలని కోరారు.