రహదారులపై ధాన్యం రాశులు.. ప్రయాణికుల నరకయాతన
మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట నుండి నర్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు వరి ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సగం రోడ్డును ధాన్యం రాశులే ఆక్రమించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ ధాన్యం కుప్పలు వాహనదారులకు సరిగ్గా కనిపించకపోవడంతో అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు.