ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

SRPT: ఆత్మకూరు(ఎస్)లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది రోగులకు సరైన సమయంలో వైద్యం అందించాలని, అన్ని రకాల మందులను ఫార్మసీలు ఉంచాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.