అభివృద్ధి పనుల పరిశీలన
AKP: గొలుగొండ మండలం జోగంపేట పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీపీ గజ్జలపు మణికుమారి, ఎంపీటీసీ జక్కు నాగమణి పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో సుమారు రూ.87 లక్షలతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఎంపీపీ తెలిపారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.